రెండేళ్ళక్రితం విశాఖలో “ముప్పయ్యేళ్ళ శంకరాభరణం” అని ఒక కార్యక్రమం జరిగింది, అందులో కె.విశ్వనాథ్ గారిని సన్మానం చేయడం కూడా జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన అతికొద్దిమందిలొ(ని
జానికి ప్రాంగణం చిన్నది)నేనూ ఒకడిని. నేను సినిమా పిచ్చోడిని, విశ్వనాథ్ గారి అభిమానిని. సన్మానం తర్వాత ఆయనని ఒకతను ఇలా ప్రశ్నించాడు.
“సినిమాలలో విలువలు తగ్గిపోతున్నాయి సార్! మీలాంటివాళ్ళు కరువైపోతున్నారు, ఎందుకు తీస్తారు సార్ అలాంటి సినిమాలు?”
ఆయన సమాధనం విని నేను ఓ మోస్తారు షాక్‌కి గురయ్యా!
“మిమ్మల్నెవరయ్యా సినిమాలు చూడమన్నది? సినిమా ఒక వ్యాపారం, ఏ నిర్మాత కూడా నష్టపోయే సినిమాలను తీయడానికి నచ్చడు,అసలు డబ్బులు పోయినా పర్వాలేదు అనుకునే నిర్మాతలతో నేను కూడా సినిమా తీయను! అలా నిర్మాత అవదామని వచ్చిన ఒకతనిని నేను తిరిగి పంపేసాను, ఆయన కూడా మీ మధ్యలోనే ఉన్నాడు” అని చెప్పి చూపించారు.
ఆయన సమాధానంవిని నాకు ఆయన మీద గౌరవం పోలేదు సరికదా, ఇంకా పెరిగింది. సినిమా మీద ఇంత ప్రేముంటే తప్ప అంత పెద్ద దర్శకుడు కాలేరని అర్దమైంది. ఆ రోజునుండి నేను కూడా నచ్చని హీరో ఐనా సినిమాలు చూడటం మొదలెట్టాను.
కాకపోతే ఈ మధ్య కొంతమంది independent film makers అని చెప్పుకుంటూ తెలుగు సినిమాలని విమర్శిస్తూనే ఉన్నారు. మనవి చెత్త సినిమాలని, అవార్డులకి పనికిరావని ఒకటే దుష్ప్రచారం చేస్తున్నారు. తెలుగు మాస్ సినిమాలు నిజానికి అవార్డులకోసం తీసేవి కావు, ముప్పయి కోట్లు ఖర్చ్చుపెట్టే ఏ దర్శకుడూ, నిర్మాత కూడా సినిమాని ఒక కళాఖండంగా కన్నా కమర్షియల్ సినిమాగా మార్చడానికే ప్రాధాన్యతనిస్తాడు. మారుతున్న ప్రేక్షకుడి నాడిని పట్టుకోవడమే వాళ్ళు చేయగలిగే పని! అసలు అవార్డులకోసం తీసే సినిమాలు థియేటర్లకి కూడా రాకుండానే వెళ్ళిపోతున్నాయంటే దానికర్దమేంటి?
సినిమా మాధ్యమం ప్రభావం జనం మీద చాలానే ఉంటుంది, కానీ ఆ జనం చూడనప్పుడు ఒక మంచి సినిమా ప్రభావం ఎంతవరకూ సమాజం మీద ఉంటుందనేది కూడా చర్చించాల్సిన విషయం! కె.వి లాంటి ఒక Outstanding దర్శకుడి సినిమాలని కూడా outdated గా జనం reject చేస్తున్న రోజులివి. ఇలాంటి సమయంలో కూడా వేదంలాంటి ఒక మంచి సినిమా కమర్షియల్‌గా మంచి విజయమే సాధించింది. వేదం,చందమామ, ప్రస్థానం, అందరిభందువయా లాంటి మంచి సినిమాలకి కూడా అవార్డులు రాలేదంటే అది తెలుగు సినీ దర్శకుల చేతకానితనం ఎంతమాత్రమూ కాదు,దానికి కారణం ముమ్మాటికీ తెలుగు సినిమా మీద చూపుతున్న వివక్షే.
ఒక సాధారణ ప్రేక్షకుడిగా నాకు నచ్చిన సినిమా గురించి, నచ్చని సినిమా గురించి చెప్పే హక్కు నాకుంటుంది, కానీ ప్రతి ఒక్కరికీ ఒక బాధ్యత కూడా ఉంటుంది. సినిమా పరిశ్రమలో పనిచేసేవారికి అది మరింత ఉంటుంది. ఒక నీచపు, దరిద్రపు బుద్దితో సినిమాలని, హీరోలని వ్యక్తిగతంగా విమర్శించేపని ఏ సినీపరిశ్రమకు చెందిన వ్యక్తి కూడా చేయడు. సినిమాల మీద ఏ మాత్రం ప్రేమలేని ఇలాంటి వాళ్ళవలన సినీ పరిశ్రమకొచ్చే ఉపయోగం ఎంత మాత్రం లేదు.
Mana bhasha meeda manaku premunte… annee sardukuntaai.
Mana Bhasha medha BolyWood vallaki Vivaksha Akuva. Andhuke mana “Aa naluguru” Movie ni Shrmila Tagore Garu Reject chesaru.Padhma awards lo kuda mana valla ki thagina pradhanayam evatam ledhu.Enka Padha awards Apodoo ravalisina varu “S.Janaki(singer),”S.Janaki(Actor)”,”Bapu(Director&Art)”,”Ramana(Writer&Art)”,”Jamuna(actor),”Krishnam Raju(actor)”,Jayasudha,Jaya Pradha,Vijay Santhi(Actors)”,”Rama Prabha(Oldest Telugu comedian)”,”Veturi,Sirivenela(Lyrics Writers)”,Anjili devi(Actor)”……………..Many more persons is there.I hope next time diff more persons will get the awards.
[...] ఆ వంటకాలని చూసి మీ నోరు ఊరక తప్పదు. K.విశ్వనాథ్ సినిమాలు చూస్తే కలిగే ఆనందం, ఆయన [...]