Feeds:
టపాలు
వ్యాఖ్యలు

‘కవిత’ అనే వర్గంలోని టపాలు

ఖాళీ!


బొమ్మ

విషయం లేక,
పదాలు దొరక్క,
కవితంతా ఖాళీ!

చిధ్రమైన అనుభవాలు,
గల్లంతైన జ్ఞాపకాలు,
గతమంతా ఖాళీ!

నీవులేనప్పుడు,
నిండుకున్న గుండెలో,
ప్రాణమంతా ఖాళీ!

Read Full Post »

మరణ శాసనం


బొమ్మ

అర్దం కానిదేదో
మనసునిండా చేరి దగ్ధం చేస్తోంది

చేతికందుతూనే
చేరువైనదేదో చేజారిపోతోంది

దారిచూపిందల్లా
జాడలేకుండా చేసి మాయమవుతోంది

ప్రేమ అనుకున్నదంతా
పాషానంలా మారి మరణ శాసనమవుతోంది

Read Full Post »


నేను సైతం అని నువ్వంటే

నిన్ను సైతం మేము కూల్చేసాం

 

ఇంకానా అనుకుంటున్నావేమో

ఇంతేనా అని మేమంటున్నాం
మరో ప్రపంచమూహించావ్

ఈ ప్రపంచాన్నుంచి తరిమేసాం

 

హీనంగా దేన్ని చూడకంటే

విహీనంగా నిన్ను చేసాం

 

అజ్ఞానపుటంధ యుగంలో

నడిపిస్తే నడిచే మనుషులం

 

నిన్ను ఆంధ్రున్ని చేసి

పడగొట్టిన అమానుషులం

 

ఓ కవీ మమ్ము క్షమించు

నవకవనంతో మా కళ్ళు తెరిపించు

Read Full Post »

అంతా కలేనా!?


అంతా కలేనా!?
ఆ పలుకుల జడి
చెంపపై కన్నీటి తడి
అంతా కలే!!
అంతా ఊహేనా!?
మన పచ్చని లోగిలి
నీ వెచ్చని కౌగిలి
అంతా ఊహే!!
అంతా కథేనా!?
పాత మధురాలలోన
తీపి అధరాల జాణ
అంతా కథే!!

Read Full Post »

ఊహలలోకంలో


ఊహలలోకం లోని కలలు, చెదరిన మైకంలోని కథలు

కలం నుండి జారిపడి కాగితం కోసం చూస్తుంటే..

ఈ ‘ అంతర్జాలము ‘ నా అంతరంగాన్ని కనిపెట్టేసింది..

నన్ను కట్టుకోమంటూ నాలుగు మొట్టికాయలు వేసింది..

నేనూరుకుంటానా దాన్ని ఒక టపాతో కట్టిపడేసాను.

Read Full Post »

అనుసరించు

Get every new post delivered to your Inbox.